
ప్రతి రోజూ ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కనీసం ఒక నెల పాటు ఇలా చేస్తే మీ శరీరంలో మంచి మార్పులు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అర చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీటిని వడగట్టి తాగాలి. నానబెట్టిన గింజలను కూడా నమిలి తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
మెంతి నీరు తాగడం వల్ల కలిగే లాభాలు
- పోషకాలు.. మెంతిలో విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ లాంటి ముఖ్యమైన పోషకాలు.. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుండి వ్యర్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- జీర్ణక్రియకు సహాయం.. మెంతి నీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ తాగితే పెద్ద జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
- బరువు తగ్గడంలో సాయం.. బరువు తగ్గాలనుకునే వారికి మెంతి నీరు చాలా ఉపయోగపడుతుంది. దీని లోని ఫైబర్ తక్కువ కేలరీలతో కడుపు నిండిన భావనను ఇస్తుంది. ఇది ఆకలిని అదుపు చేసి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
- గుండె ఆరోగ్యానికి మంచిది.. ఇది పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజూ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.
- చర్మ సౌందర్యం.. నానబెట్టిన మెంతి నీరు చర్మ సమస్యలకు బాగా పని చేస్తుంది. మొటిమలు, మచ్చలు, దద్దుర్లు లాంటివి తగ్గుతాయి. దీనితో చర్మం శుభ్రంగా, కాంతివంతంగా మారుతుంది.
షుగర్ ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మెంతి నీరు తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)