ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రోజు మార్చి9న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది.. 24 ఏళ్ల బిటెక్ విద్యార్థిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా చంపారు.. అగ్గిపెట్టే విషయంలో జరిగిన గొడవ.. ఘర్షణకు దారి తీసింది.. ఇది కాస్త విద్యార్థిని చంపేవరకు వెళ్లింది.. ఆగ్రాలో స్నేహితులతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చూస్తున్న 24 ఏళ్ల బిటెక్ విద్యార్థి సిద్ధాంత్ గోవిందంను కత్తితో పొడిచి చంపిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్గిపెట్టె విషయంలో జరిగిన వివాదం తరువాత ఈ సంఘటన జరిగిందని.. అనుమానితులను కన్హయ్య దివాకర్, దిలీప్ సింగ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి శాస్త్రిపురంలోని జెసిబి మైదానంలో భారత్-న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను స్నేహితులతో కలిసి చూస్తున్న 24 ఏళ్ల బిటెక్ విద్యార్థిని ఇద్దరు కత్తితో పొడిచి చంపారు.. ఆగ్రా నివాసిలైన కన్హయ్య దివాకర్ (24), దిలీప్ సింగ్ (26), వారి సహచరుడు అభిషేక్ కుమార్.. మోటార్ సైకిల్‌పై మైదానానికి వచ్చి మద్యం సేవిస్తున్నారని పోలీసులు తెలిపారు. అప్పటికే.. సిద్దాంత్ గోవిందం.. అతని ముగ్గురు స్నేహితులు సమీపంలో పార్క్ చేసిన మూడు స్కూటర్లపై కూర్చుని తమ మొబైల్ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు.
ఈ క్రమంలో మద్యం తాగి ఉన్న అభిషేక్.. సిద్దాంత్ గోవిందం వద్దకు వచ్చి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె అడిగాడు.. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది.. అంతలోనే ఇది ఘర్షణకు దారితీసింది. కత్తితో ఉన్న అభిషేక్, అతని సహచరులతో కలిసి, సిద్ధాంత్‌ను కత్తితో పలుమార్లు పొడిచాడు.. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత దుండగులు పారిపోయారని.. బుధవారం పోలీసులు తెలిపారు.
వెంటనే సిద్ధాంత్ ను ఆసుపత్రికి తరలించారు.. అయితే.. సిద్ధాంత్ ఛాతీ, కడుపుపై బహుళ కత్తిపోట్లు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రకటించారు. బాధితురాలి తండ్రి సోమవారం చేసిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై BNS సెక్షన్ 103 (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
సిద్ధాంత్ తండ్రి అనిల్ కుమార్ గోవిందం మాట్లాడుతూ.. తన కొడుకు నగరంలోని దయాల్‌బాగ్ విద్యా సంస్థలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని స్నేహితుల్లో ఒకరు.. తనకు ఫోన్ గుర్తుతెలియని వ్యక్తులు సిద్ధాంత్ చంపారని సమాచారం ఇచ్చాడని.. తెలిపారు. తన కుమారుడిని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..