వ్యక్తుల అలవాట్లే వారి రోజూవారి సంతోషాలకు కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ అలవాట్లు ఉన్నవారు డబ్బుతో సంబంధం లేకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతారట. మీరు మీ సాయంత్రాలను ఎలా గడుపుతున్నారనేది చాలా ముఖ్యమైన అంశమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మీ మొత్తం ఆనందంపై ఇది భారీ ప్రభావాన్ని చూపుతుందట. చాలా మంది తమ రోజును స్క్రోలింగ్ చేస్తూ లేదా రేపటి గురించి ఒత్తిడికి గురవుతూ ముగిస్తుంటారు. అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తుల అలవాట్లను చూస్తే వారు రోజంతా ఎలా ఉన్నా సాయంత్రాలను మాత్రం అందంగా ఆహ్లాదంగా మలుచుకుంటారు. ఈ చిన్న పని మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మలిచే శక్తివంతమైన సాధనం. అదెలా అంటారా.. ఓసారి ఈ విషయాలు పరిశీలించండి.
1) వారు పడుకునే ముందు స్క్రీన్ చూడరు..
టీవీలు, ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ప్రతిచోటా స్క్రీన్‌లు ఉంటాయి. అవి మనం ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండటానికి సహాయపడుతుంటాయి. మన మనస్సులను అతిగా ఉత్తేజపరుస్తాయి. కానీ వీటి వల్ల మనం నిజంగా విశ్రాంతి తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. నిరంతరం సంతోషంగా ఉండేవారికి ఇది తెలుసు. అందుకే వారు పడుకునే ముందు కనీసం గంట ముందు స్క్రీన్‌లను అన్‌ప్లగ్ చేయడం అలవాటు చేసుకుంటారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం లేదా మరొక ఎపిసోడ్‌ను నిరంతరం చూడటం కంటే, వారు నిజంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే కార్యకలాపాలను ఎంచుకుంటారు – పుస్తకం చదవడం, జర్నలింగ్ చేయడం లేదా వారు శ్రద్ధ వహించే వారితో నిజమైన సంభాషణ చేయడం. స్క్రీన్‌ల నుండి దూరంగా ఉండటం ద్వారా మనసుకు విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్రను రోజును ప్రశాంతంగా ముగించడానికి వీలు కలుగుతుంది.
2) ప్రతి రాత్రి వసంత రాత్రే..
మన వల్ల తప్పు జరిగిన ప్రతిసారీ దాని గురించి ఆలోచిస్తూ పడుకోవడం అందరూ చేసే పనే. ఆరోజు మీకేదైనా ఇబ్బందికర సంఘటన ఎదురై ఉండొచ్చు. ఎవరైనా మీ మనసు గాయపరిచి ఉండొచ్చు. కానీ, రోజులో జరిగినవననీ పడుకునే ముందే ఎందుకు ఆలోచించాలి. రేపటి రోజును కొత్తగా ఆరంభించొచ్చు కదా.. సంతోషాన్ని పంచే వారు మనస్సులో చివరి విషయంగా బాధను ఉండనివ్వరు. కఠినమైన రోజుల్లో కూడా చిన్న చిన్న ఆనందాలను వారు కనుగొనగలరు. మనస్తత్వంలో వచ్చే ఈ చిన్న మార్పు మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.
3) ఉదయం యుద్దానికి వెళ్తున్నట్టు నిద్రలేవరు..
మంచి నిద్ర అంటే మీరు ఎంతసేపు నిద్రపోతున్నారనే దాని గురించి మాత్రమే కాదు మీరు ఎప్పుడు నిద్రపోతున్నారనేది కూడా చాలా ముఖ్యం. నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తులు వారాంతాల్లో కూడా ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని మేల్కొంటారు. మీ శరీరం సహజమైన లయను అనుసరిస్తుంది. మీరు మీ నిద్ర షెడ్యూల్‌ను నిరంతరం మార్చుకుంటూ పోతే అది అన్నింటినీ మార్చేస్తుంది. ఆఖరికి మీ మూడ్ స్వింగ్స్ ను కూడా. శక్తి స్థాయిలు, మీ మానసిక స్థితి, ఒత్తిడిని కంట్రోల్ చేయగల శక్తి నిద్రకు ఉంది. మీరు రోజూ ఒకే టైమ్ ఫాలో అవుతున్నప్పుడు మీ శరీరానికి ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో, ఎప్పుడు మేల్కొనాలో కచ్చితంగా తెలిసిపోతంది. అప్పుడు ఉదయం యుద్ధంలా కాకుండా కొత్త ప్రారంభంలా అనిపిస్తుంది.
4) వారు పడుకునే ముందు విశ్రాంతినిచ్చే పని చేస్తారు
నిద్రపోయే ముందు చివరి గంట మీరు ఎలా గడుపుతారు అనేది మరుసటి రోజు కోసం మీ మూడ్ ని డిసైడ్ చేస్తుంది. సంతోషంగా ఉన్న వ్యక్తులు నిజంగా విశ్రాంతినిచ్చే దానితో అంటే వారి మెదడుకు విశ్రాంతి సమయం అని సంకేతాలు ఇచ్చే దానితో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. కొంతమందికి పుస్తకం చదవడం. మరికొందరికి ధ్యానం, సున్నితమైన ప్రశాంతమైన సంగీతాన్ని వినడం. ఏదైనా సరే, వేగాన్ని తగ్గించి, రోజులోని గందరగోళం నుండి దూరంగా ఉండటం కీలకం.