ఎవర్రా సామీ.. ఒకే బంతికి 17 పరుగులు.. ప్రపంచంలోనే అత్యంత పరమ చెత్త బౌలర్‌గా రికార్డ్..

ఎవర్రా సామీ.. ఒకే బంతికి 17 పరుగులు.. ప్రపంచంలోనే అత్యంత పరమ చెత్త బౌలర్‌గా రికార్డ్..


Shameful Record in Cricket: క్రికెట్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు, కొన్ని ఓవర్లు అభిమానుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఇలాంటి వాటిలో ఓ అద్భుతమైన రికార్డ్ కూడా ఉంది. ఒకే బంతికి 17 పరుగులు చేయడం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ చెత్త రికార్డును పాకిస్తాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ సృష్టించాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్ కూడా ఒకే బంతికి 17 పరుగులు చేయడం గురించి ఆలోచించడు. ఎందుకంటే ఇది దాదాపు అసాధ్యం. అలాంటి మరుపురాని క్షణాల్లో ఒకటి 2004 మార్చి 13న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మారణహోమం నుంచి వచ్చింది.

2004 మార్చి 13న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ బౌలర్ రాణా నవేద్-ఉల్-హసన్ వేసిన ఒక ఓవర్‌లో 17 పరుగులు చేశాడు. ఇప్పటివరకు, ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్ గురించి చెప్పాలంటే, అతని బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉండేది. 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఇంకా వీరేంద్ర సెహ్వాగ్ లాంటి బ్యాట్స్‌మన్‌ను కనుగొనలేదు.

2004 మార్చి 13న, కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో, పాకిస్తాన్ బౌలర్ రాణా నవేద్-ఉల్-హసన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో జరిగిన ఓవర్‌లో వరుసగా 3 నో బాల్స్ వేశాడు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ రెండు బంతుల్లో ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత, లీగల్ బాల్‌లో ఒక్క పరుగూ రాలేదు. ఆ తర్వాత, రాణా నవేద్-ఉల్-హసన్ మళ్ళీ రెండు నో బాల్స్ వేశాడు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ ఒక బంతికి ఫోర్ కొట్టగా, మరొక బంతికి ఒక్క పరుగూ రాలేదు. ఈ విధంగా, రాణా నవేద్-ఉల్-హసన్ వేసిన ఆ ఓవర్‌లో, వీరేంద్ర సెహ్వాగ్ 3 ఫోర్లతో 12 పరుగులు, 5 నో బాల్స్‌లో 5 అదనపు పరుగులు సాధించాడు. ఇలా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెహ్వాగ్ ఆ ఓవర్‌లో సాధించిన 17 పరుగులే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. బౌలర్‌పై ఆధిపత్యాన్ని చెలాయించడంలో సెహ్వాగ్ ఎంత ముందుంటాడో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా సెహ్వాగ్ ఫ్యాన్స్‌కు, ఆ ఓవర్ ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది. తన దూకుడైన ఆటతో వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ సంఘటన అతని కెరీర్‌లో ఒక హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *