ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్కును చూపించుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరువేరుస్తూ వస్తుంది. ఇప్పటికే పెన్షన్‌తో పాటు ఇతర పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వాటిని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోందనే తేదీలను మంత్రి నారాయణ ప్రకటించారు. జూన్ నెల నుంచి తల్లికి వందనం, ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి నారాయణ తెలిపారు.
అయితే రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన రోజు రోజునే తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామని మంత్రి నారాయణ ఆత్మకూరులో జరిగిన మినీ మహానాడు సభలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక రాష్ట్రం మొత్తాన్ని అతలా కుతలం చేశారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపి వెళ్లిపోయిందన్నారు. ఆ అప్పులను ఇప్పుడు ప్రభుత్వమే తీర్చాలని తీర్చకపోతే ఇచ్చిన వారు ఊరుకుంటారా అని ఆయన అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని ఆయన అన్నారు.
ఈ క్రమంలోనే జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం ఒక మున్సిపల్ శాఖలోనే 3000 కోట్లు అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలోని మత్సశాఖ, ఇతర శాఖల ఇబ్బందులు గురించి అసెంబ్లీలో చర్చించామని తర్వలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..