కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతారు. మరికొంతమంది మాత్రం ప్రయత్నిస్తూ స్టార్స్ గా మారతారు. ఈ మధ్య ఇంకొంతమంది ఒకే ఒక్క సీన్ తో కూడా పాపులర్ అవుతున్నారు. కాగా చాలా మంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ కిడ్ కానీ ఆమె లైఫ్ అంత సజావుగా సాగలేదు.. ఎన్నో కష్టాలు చూసింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ఐదు సినిమాలు చేసింది. కానీ ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో 5 సినిమాలు చేస్తే ఒక ఒక్క హిట్ అందుకుంది. అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా.. రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు. అందాల భామ ఐశ్వర్య రాజేష్ .
ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె తల్లి నాగమణి ప్రసిద్ధ నృత్యకారిణి. ఐశ్వర్య టెలివిజన్ షో మానాడ మైలాడ ద్వారా సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే “అసత్తప్ పోవడు ఎవరు” అనే రియాల్టీ షోతో తన మీడియా ప్రయాణాన్ని ప్రారంభించింది. 2010లో పంచ్ భరత్ దర్శకత్వం వహించిన “నీతనా అవన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీతోనే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2017లో మలయాళంలో “జోమొండే సువిసెసమల్” ప్రధాన పాత్రలో నటించింది. ఇక తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో అడుగుపెట్టింది. ఆతర్వాత వరుసగా మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియెట్స్ చేసింది ఈ సినిమా. ఐశ్వర్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.