ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్‌చేస్తే..

ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్‌చేస్తే..


శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో వావివరసలను మరిచి ఓ వివాహిత జరిపిన వివాహేతర సంభందం పచ్చని పల్లెల్లో చిచ్చు రేపింది. ఆమెతో పాటు ఎదురింటిలో ఉండే మరో వ్యక్తి ప్రాణాలని బలితీసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులకు ఒక కుటుంబంలో తల్లిని, మరో కుటుంబంలో తండ్రిని దూరం చేసింది. మే, జూన్ నెలల్లో జరిగిన ఈ రెండు జంట హత్యల కేసు జిల్లాలో సంచలనం రేపింది. ఎదురెదురు ఇళ్లల్లో ఉండే ఇద్దరు వ్యక్తులు 25 రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవ్వడంతో అసలు గ్రామంలో ఏం జరుగుతోందో అని అటు గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ రెండు హత్యలు చేసింది పలాస మండలం మహదేవుపురానికి చెందిన మడియా రామారావు(37) అనే వ్యక్తగా గుర్తించారు. గురువారం ఆయనను అరెస్ట్ చేసి విచారించగా.. విచారణలో హంతకుడు చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.

వివరాళ్లోకి వెలితే.. రాజేశ్వరి భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో ఉంటున్నాడు. రాజేశ్వరి తమ ఇద్దరు పిల్లలతో కలిసి పాలవలసలో అత్తమామల వద్ద ఉంటోంది. ఇదే అదునుగా చేసుకున్న ఆమె ఆడపడుచు భర్త రామారావు చిన్నచిన్న అవసరాలు తీరుస్తూ రాజేశ్వరికి బాగా దగ్గరయ్యాడు. అదే క్రమంలో వావివరసలు మరిచి ఇద్దరి మధ్య వివాహేతర సంభందం పుట్టుకొచ్చింది. వీరి వివాహేతర సంబంధం రాజేశ్వరి ఎదురింటిలో ఉండే గోకర్ల.ఈశ్వరరావుకి తెలిసింది. ఇక అప్పటి నుండి రాజేశ్వరి పై ఈశ్వరరావు సైతం ఆశపడుతూ వచ్చాడు. ఆ విషయం రామారావుకి తెలిసింది. దీంతో రామరావు మే 17న రాత్రి గోకర్ల ఈశ్వరరావును మద్యం సేవిద్దామని పాలవలసలోని జీడి తోటలలోకి తీసుకెళ్లాడు. అక్కడ బీర్ బాటిల్‌తో ఈశ్వరరావుపై దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఎవరి కంటా పడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తరువాత ఇంటికి వచ్చి ఈశ్వరరావుని హత్య చేసిన విషయం రాజేశ్వరికి వివరించాడు.

దీన్ని అదునుగా చేసుకున్న రాజేశ్వరి తన అవసరాలకు డబ్బులు కావాలని, ఇవ్వకుంటే ఈశ్వరరావు హత్య చేసిన విషయం బయట పెట్టేస్తానంటూ రామారావును వేధించడం స్టార్ట్‌ చేసింది. రాజేశ్వరి ఎప్పటికున్న విషయం బయటపెడుతుందని భావించిన రామారావు రాజేశ్వరిని కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్లాన్‌ ప్రకారం (జూన్) 11న మందస మండలం పితాలి సమీపంలోని జీడి తోటల్లోకి రాజేశ్వరిని బైక్‌పై తీసుకువెళ్ళాడు. అక్కడ ఇద్దరూ శారీరకంగా కలిశారు. అనంతరం రామారావు రాజేశ్వరిని చున్నీతో గొంతు నులిమి చంపేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్ళిపోయాడు. రాజేశ్వరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.

రాజేశ్వరి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. మృతి చెందిన ఐదు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యం అయింది. అయితే పాలవలస గ్రామానికి చెందిన ఈ రెండు హత్యలను పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని విచారణ చేపట్టగా.. మహాదేవుపురంకి చెందిన రామారావుపై పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. అతనిపై నిఘా పెట్టగా గురువారం రామారావు తనకు తానుగా విఆర్ఓ ముందుకు వచ్చి లొంగిపోయినట్లు పోలిసులు తెలిపారు. రామారావును అరెస్ట్ చేసిన పోలీసులు రాజేశ్వరి వద్ద నుండి దోచుకున్న బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన రాజేశ్వరికి పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల చంద్రశేఖర్‌తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి నాలుగేళ్ళు, రెండేళ్ళ వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇక మరో మృతుడు ఈశ్వరరావుకి భార్య స్వాతి,మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈశ్వరరావు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. అయితే ఊరులో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతుండటంతో ఏప్రిల్ లో స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యాడు. మొత్తానికి వివాహేతర సంబంధం పచ్చని గ్రామంలో కల్లోలం రేపింది. పెద్దలు చేసిన పనికి రెండు ప్రాణాలు బలవ్వగా… చిన్నారులు అనాధులయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *