ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

ఒక్క టూత్‌ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో


సోతాజాగా ఓ మహిళ చేసిన జుగాడ్‌ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ మహిళ తన ఇంటి విండోస్‌ని క్లీన్ చేస్తోంది. అదెలాగో చూసేయండి మరి..! వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ వాడి పక్కన పడేసిన టూత్‌ బ్రష్‌ను తిరిగి ఉపయోగించిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ మహిళ ఓ చాకు తీసుకొని దానిని స్టవ్‌మీద బాగా వేడిచేసింది. దాన్ని తీసుకొని వాడి పక్కన పడేసిన టూత్‌ బ్రష్‌ తల భాగాన్ని కట్‌చేసింది. ఆ తర్వాత బ్రష్‌ హ్యాండిల్‌ భాగాన్ని మంటమీద పెట్టి కాల్చింది. ఇప్పుడు ఈ హ్యాండిల్‌ తీసుకొచ్చి కట్‌ చేసిన బ్రష్‌ హెడ్‌కి వెనుకవైపున అతికించింది. ఇప్పుడది ఓ కొత్తరకం క్లీనింగ్‌ బ్రష్‌లా తయారైంది. దాంతో ఎంచక్కా కిటికీ మూలల్లో చేయి వెళ్లలేని చోటుకూడా ఈజీగా శుభ్రం చేసేసింది. మహిళ తయారుచేసిన క్లీనింగ్‌ బ్రష్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్‌ వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *