కానీ సుమారు నాలుగు నెలలు వయసు గడిచినా సరే శరీరం మీద ఎక్కడ దానికి ఈకలు రాలేదు. అందులోనూ అది కోడిపుంజు కావడంతో అసలు ఈకలు ఎందుకు రావడం లేదు అనే విషయం ఇస్మాయిల్ కు అర్థం కాలేదు. మిగతా కోళ్లలాగే ఆహారంతోపాటు అన్ని క్రియలను ఈకలు లేని కోడిపుంజు చేస్తుంది. కోడిపుంజు అయినా దానికి ఈకలు లేకపోవడం కారణంగా కోడిపందాలకు పని చేయదు. అయితే ఇస్మాయిల్ వద్ద ఉన్న ఈ వెరైటీ కోడిపుంజును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈకలు లేకుండా ఉన్న కోడిపుంజును ఈ ప్రాంతంలో తామ ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా కోళ్లలో ఈకలు లేమి సమస్య తలెత్తిదంటున్నారు వైద్యులు. జన్యు సంబంధమైన లోపాల కారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈకలు లేకపోవడం సంభవిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈకలు రాకపోవడం కారణంగా ఈ కోడికి ఎటువంటి అనారోగ్యం ఉండదు కానీ..ఈకలు లేని కారణంగా సాధారణ కోళ్లు మాదిరి ఎగరడానికి వీలుండదని పశు వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదిమజాతి బాలుడిని ఎప్పుడైనా చూశారా? లైటర్ ఇస్తే ఏం చేశాడో తెలుసా..?
ఆ మహిళ ఇంటి తలుపు తట్టిన కలెక్టర్… ఏం చేశాడో చూడండి
ప్రభాస్ చేతిలో… త్రివిక్రమ్ పెద్ద కొడుకు
చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో
Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్