బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల ఈ అమ్మడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి.. దిబిడే అంటూ కుర్రకారు గుండెలకు గాయం చేసింది. ఈ సాంగ్ లో ఈ బ్యూటీ తన డ్యాన్స్ తో ఇరగదీసిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ నటి ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
బద్రీనాథ్ సమీపంలో తన పేరుతో గుడి ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ నటి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ వైపు ఈ కాంట్రవర్సీ నడుస్తుండగానే, మరో వైపు ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకారుకు విందు భోజనం పెట్టేస్తుంది.
గ్రీన్ వెల్వెట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో ఫొటోలు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలో ఈ అమ్మడు కొంటె చూపు చూస్తూ కుర్రకారుకు కైపెక్కిస్తుంది. ఇందులో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది.
ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా గ్రీన్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి!