కుక్కను చూసి చిరుత పరుగో పరుగు.. దెబ్బకు చెట్టెక్కేసిందిగా!

కుక్కను చూసి చిరుత పరుగో పరుగు.. దెబ్బకు చెట్టెక్కేసిందిగా!


ఇటీవల వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో చిరుతలు, పులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి వీరిపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలు కొందరు ప్రాణాలు కోల్పోతే, కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా కొమురం భీం జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించిన చిరుతను గ్రామ సింహం ఉరుకులు పెట్టించింది. దెబ్బకు చిరుతను చెట్టెక్కించింది ఆ గ్రామ సింహం.

సాధారణంగా పులులు, చిరుతల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవుల్లో అడవిపందుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రూర మృగాల ప్రత్యామ్నాయ ఆహారం కుక్కలు. అందుకే ఈ చిరుతలు, పులులు జనావాసాల్లోకి వస్తున్నాయని, ఈ క్రమంలోనే మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని ఇటీవల అటవీశాఖ అధికారులు వివరించారు.

కాగా తాజాగా కొమురం భీం జిల్లా తిర్యాని మండలం చింతపల్లి గ్రామ శివారులో చిరుతపులి కలకలం రేపింది. గ్రామంలోకి ఎంటరయిన చిరుతను ఓ కుక్క తరమడంతో అది భయంతో అక్కడే ఉన్న ఓ ఎత్తయిన చెట్టుపైకి ఎక్కి చిటారు కొమ్మన కూర్చుంది. దానిని చూసి ఆ గ్రామంలో సంచరించే వీధి శునకం మొరుగుతూ ఉంది. ఈ కుక్క చెట్టుపైకి చూస్తూ అదేపనిగా మొరుగుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఏమై ఉంటుందా అని అక్కడికి వచ్చి పరిశీలించగా చెట్టుపైన చిరుత కూర్చుని కనిపించింది. దానిని చూసి షాకయిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు స్థానికులు చెట్టుపై కూర్చున్న చిరుతను తమ మొబైల్స్‌లో వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధఙకారులు, సిబ్బంది చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *