కేజీఎఫ్… ఇప్పుడు ఈ పేరు నేషనల్ లెవల్లో పాపులర్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌గా పరిచయం అయిన ఈ పేరును ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు మన మేకర్స్. సూపర్ హిట్ అయిన ఈ బ్యాక్ డ్రాప్లో మళ్లీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ అభిమానులను ఆ ప్రవంచంలోకి తీసుకెళ్లింది. అందుకే ఆ క్రేజ్‌ను మళ్లీ మళ్లీ క్యాష్
తంగలాన్ సినిమా కథ కూడా కేజీఎఫ్ నేపథ్యంలో సాగుతోంది. బంగారు నిల్వలను సొంతం చేసుకోవాటానికి ఆంగ్లేయులు ఓ గిరిజిన తెగను ఎలా వాడుకున్నారు. వాళ్లకు ఏం ఆశచూపారు. ఆ ప్రయత్నంలో ఎదురైన సమస్యలేంటి అన్నదే తంగలాన్ కథ.
తాజాగా ఇదే నేపథ్యంలో మరో మూవీ రెడీ అవుతోంది. ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్లో ఐదో సినిమాను, కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలోనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కేజీఎఫ్‌ను మరింత రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు.