కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తిప్పలదొడ్డి గ్రామంలో చిరుత పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు కొబ్బరిచెట్టుపై చిరుతను చూసి షాకయ్యారు. అంత ఎత్తయిన చెట్టుపైకి చిరుత ఎలా వెళ్లిందని ఆశ్చర్యపోయారు. ఏ క్షణంలో ఎవరిపైన పడుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. చిరుతను చూసేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు అటవీ సిబ్బంది. కాగా చిరుతను రెచ్చగొట్టేలా ఎలాంటి పనులకు పూనుకోవద్దని.. అటవీ శాఖ సిబ్బంది గ్రామస్థులకు సూచించారు.
మరిన్నివీడియోల కోసం :
ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్
డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్