కొబ్బరి పువ్వు.. ఈ పువ్వు శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటితో పోల్చితే కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆలయంలో కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు దానిలో పువ్వు ఉంటే భక్తులు సంతోషపడతారు. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు పువ్వు ఉంటే కోరిక నెరవేరుతుందని సంతోషిస్తారు.
కొంతమంది కొబ్బరి పువ్వును రుచి చూస్తూ ఉంటారు. కొబ్బరి పువ్వు రోడ్డుపై అమ్ముతుంటే కొందరు దానిని చూస్తూ ఇది దేనికి అని అడుగుతారు. కొబ్బరి, కొబ్బరి నీరు విస్తృతంగా వాడతారు. కానీ కొబ్బరి పువ్వు గురించి చాలా మందికి తెలియదు. ఈ పువ్వు థైరాయిడ్ సమస్యలు, కాలం తిరుగుడు ఇన్ఫెక్షన్లకు రక్షణగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి పువ్వు తినడం వల్ల లాభపడతారట.
కొబ్బరి పువ్వు క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని కూడా ప్రేరేపిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిలోని ఖనిజాలు, విటమిన్లు ప్రేగులను రక్షించి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
కొబ్బరి పువ్వు మంచి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అది కొబ్బరి నీటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
కొబ్బరి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. చర్మానికి ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. మూత్రపిండాలకు కూడా రక్షణగా నిలుస్తుంది. దీనివల్ల మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శారీరకంగా అలసినవారు ఈ పువ్వు తింటే శక్తి పెరుగుతుంది.
కొబ్బరి పువ్వు గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో కొబ్బరి పువ్వు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఋతుస్రావం సమస్యలతో బాధపడే స్త్రీలకు కొబ్బరి పువ్వు తినడం వల్ల రక్తస్రావాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. శరీర వేడిని తగ్గించే సామర్థ్యం కూడా ఇందులో ఉంది.