క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!


ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం. మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి. క్రీడాకారులు ఆటలో వేగాన్ని కొనసాగించాలంటే ఈ సహజ ఎనర్జీ సోర్స్ చాలా అవసరం.

ఆటల్లో శరీరానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల ఎక్కువగా చెమట కరుగుతుంది. చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల కండరాలు పట్టేసే సమస్యలు రావచ్చు. అరటిపండులో ఉన్న పొటాషియం శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆటల సమయంలో ఎక్కువ శక్తి ఖర్చవుతుంటుంది.. అందుకే జీర్ణక్రియ బలంగా ఉండాలి. అరటిపండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు రావు, శరీరం తేలికగా అనిపిస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తాగడం కన్నా.. అరటిపండు తినడం చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే ఇది సహజమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, మాల్టోజ్‌ను కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి దీర్ఘకాలిక శక్తిని కొనసాగించడానికి ఉపయోగపడుతాయి.

ఆటల్లో ఒత్తిడి అనేది సహజం. గెలుపోటముల భయం, శారీరక శ్రమ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అరటిపండులో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మంచి పోషకాలు, సహజ చక్కెరల మిశ్రమం కలిగిన అరటిపండు శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల క్రీడాకారులు ఆటలో ఎక్కువ సేపు అలసటను అనుభవించకుండా చురుకుగా ఉండగలుగుతారు.

చెమటతో శరీరంలో నీరు తగ్గిపోతుంది. అరటిపండులో నీరు, పోషకాలు ఉండటం వల్ల హైడ్రేట్‌గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పైగా కండరాలకు అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి నొప్పులు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *