ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సైలెంట్ కిల్లర్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు, సంకేతాలపై అవగాహనతో ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా.. సకాలంలో చికిత్స పొంది గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. అయితే, గుండెపోటు ప్రమాదాన్ని ముఖం నుండే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. మీరు మర్చిపోయి కూడా ముఖ లక్షణాలను విస్మరించవద్దని.. దీనివల్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంటున్నారు.
గుండెపోటు గురించి మాట్లాడేటప్పుడు.. ముందుగా గుర్తుకు వచ్చే లక్షణం తీవ్రమైన ఛాతీ నొప్పి.. ఇది గుండెపోటుకు ప్రాథమిక సూచన. దీనితో పాటు, ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని లక్షణాలను మనం ఆలోచించము.. అయితే.. అవి గుండెపోటుకు సంబంధించినవి కావచ్చని.. వీటిపై అవగాహనతో ఉండాలని పేర్కొంటున్నారు. గుండెపోటుకు ముందు, ముఖంపై కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ఇవి గుండె జబ్బుల ప్రమాదం ఉందో లేదో గుర్తించడంలో సహాయపడతాయి. ఈ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. కానీ పంటి నొప్పి గుండెపోటు వల్ల వస్తుంది. ఏదైనా సమస్య వల్ల కూడా పంటి నొప్పి రావచ్చు.. నొప్పి దీర్ఘకాలంపాటు కొనసాగితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు..
చాలా మందికి చిగుళ్ళలో రక్తస్రావం సమస్య ఉంటుంది. కొన్నిసార్లు ఇది సాధారణం కావచ్చు.. కానీ కొన్నిసార్లు ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. మీరు నిరంతరం చిగుళ్ళలో రక్తస్రావం అనుభవిస్తుంటే.. దానిపై శ్రద్ధ పెట్టండి.. వెంటనే వైద్యుడిని సంప్రదించి సకాలంలో చికిత్స పొందండి.
నోటి పూతల కడుపు సమస్యల వల్ల సంభవిస్తాయని చెబుతారు.. కానీ కొన్నిసార్లు ఈ పూతల గుండెపోటుకు సంకేతం కావచ్చు. వైద్యుల ప్రకారం.. గుండెపోటుకు ముందు నోటి పూతలు సంభవించవచ్చు. కాబట్టి, మీకు దీర్ఘకాలికంగా నోటి పూతలు సమస్య ఉంటే వాటిని విస్మరించవద్దు.
సాధారణంగా మనకు దవడలో నొప్పి రావడం మొదలవుతుంది.. దానిని సాధారణమైనదిగా భావించి పొరపాటు చేస్తాము. కానీ గుండెపోటు రాకముందే దవడ నొప్పిని అనుభవించవచ్చు. మీరు దవడ నొప్పిని ఎదుర్కొంటుంటే, సమయానికి వైద్యుడిని సంప్రదించండి.
గుండెపోటు (హార్ట్ ఎటాక్) సాధారణ లక్షణాలు ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం లేదా వాంతులు, చెమటలు పట్టడం, మైకము లేదా మూర్ఛ వంటివి ఉంటాయి. స్త్రీలలో, అలసట, నిద్రలేమి, వీపు, భుజాలు, మెడ, చేతులు లేదా పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.