హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదనిపించినా అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.
దీంతో తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో ఆఫర్ రావడంతో ఒకే చెప్పేసిన ఈ బ్యూటీ, ఈ మూవీలో తన నటన, గ్లామర్‌తో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత హిట్ ది సెకండ్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ , సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లో నించి మెప్పించింది.
ముఖ్యంగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటీ సినిమాలతో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా తన నటనతో వావ్ అనిపించుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడుకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మీనాక్షి చౌదరికీ వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతులో అరడజన్ సినిమాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ వరస ఫొటోషూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.