డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 4 భారతీయ కంపెనీలపై నిషేధం!

డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 4 భారతీయ కంపెనీలపై నిషేధం!


అమెరికా నాలుగు భారతీయ కంపెనీలను నిషేధించింది. US స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం (ఫిబ్రవరి 24, 2025) నాడు ఈ ప్రకటన చేసింది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో ఈ కంపెనీలు పాల్గొన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే ఇరాన్‌కు చమురు అమ్మకాలను నిలిపివేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC), అమెరికా విదేశాంగ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ దేశాలలో 30 కంటే ఎక్కువ మంది వ్యక్తులతోపాటు నౌకలపై నిషేధం విధించాయి. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన నాలుగు కంపెనీలు కూడా ఉన్నాయి.

OFAC, US స్టేట్ డిపార్ట్‌మెంట్ నుండి అందిన సమాచారం ప్రకారం, ఆ నాలుగు భారతీయ కంపెనీలు – నవీ ముంబైకి చెందిన ఫ్లక్స్ మారిటైమ్ LLP, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)కి చెందిన BSM మెరైన్ LLP, ఆస్టిన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు తంజావూరుకు చెందిన కాస్మోస్ లైన్స్ ఇంక్. నాలుగు కంపెనీలలో మూడు ఇరానియన్ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో సాంకేతిక నిర్వాహకులుగా ఉన్నందున నిషేధించారు. అయితే ఇరానియన్ పెట్రోలియం రవాణాలో దాని ప్రమేయం కోసం కాస్మోస్ లైన్స్ నిషేధించినట్లు అమెరికా పేర్కొంది.

నిషేధిత జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), హాంకాంగ్ నుండి చమురు మధ్యవర్తులు, భారత్ , పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇరాన్‌కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ అధిపతి, ఇరానియన్ ఆయిల్ టెర్మినల్స్ కంపెనీ నుండి ట్యాంకర్ ఆపరేటర్లు, మేనేజర్లు ఉన్నారని OFAC తన ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీల కార్యకలాపాల ద్వారా ఇరాన్ కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయి. నిషేధించిన నౌకలు వందల మిలియన్ల డాలర్ల విలువైన పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించేలా ఇరాన్ తన అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ చమురు ఎగుమతులు అనేక అధికార పరిధిలో చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయని వెల్లడించింది. ట్రంప్ పరిపాలన తీసుకున్న ఈ చర్యలు ఇరాన్ అస్థిరపరిచే కార్యకలాపాలను ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *