దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య ఊహించని విధంగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షణగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కానీ, మృతుల వివరాలపై రైల్వేశాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తొక్కిలాసట క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పరిస్థితి భయానకంగా మారింది. ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు చెల్లా చెదురుగా పడివున్న దృశ్యాలు హృదయవిధారకంగా కనిపించాయి.
Visuals from New Delhi railway station following a stampede this evening.
Railways have decided to run special Kumbh Mela trains after the incident.ఇవి కూడా చదవండి
DISTURBING VISUALS!
#NewDelhi #Stampede #KumbhMela2025 @OdishaRail pic.twitter.com/kMYEr5yCcp
— Spotlight (@Spotlight_BBS) February 15, 2025
ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు.
Devastating news from New Delhi Railway Station. I am extremely pained by the loss of lives due to stampede on Railway platform. In this hour of grief, my thoughts are with the bereaved families. Praying for the speedy of the injured.
— Rajnath Singh (@rajnathsingh) February 15, 2025
తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు.
Situation under control at New Delhi railway station (NDLS)
Delhi Police and RPF reached. Injured taken to hospital. Special trains being run to evacuate sudden rush.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 15, 2025
అటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదారులు, రైల్వే లైన్లు, విమాన సర్వీసులు సైతం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నెలకొన్న రద్దీ కారణంగానే ప్రయాణికుల మధ్య తోపులాట జరిగిందని సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..