టాలీవుడ్లో పెద్ద బ్యానర్స్ అన్నీ.. భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి.
దిల్ రాజునే తీసుకోండి.. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా సార్, లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం బడ్జెట్లోనూ సినిమాలు వస్తుంటాయి. తాజాగా మ్యాడ్ 2తో పాటు VD12, రవితేజ మాస్ జాతర ఈ బ్యానర్ నుంచి వస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అయిన గీతా ఆర్ట్స్ నుంచి తండేల్ వస్తుందిప్పుడు.
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ కోసం 80 కోట్లు ఖర్చు చేసింది గీతా ఆర్ట్స్. వందల కోట్లతో సినిమాలు నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ నితిన్‌తో రాబిన్ హుడ్ నిర్మిస్తున్నారు.
200 కోట్లతో విశ్వంభర నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీతో ఓ మీడియం రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద బ్యానర్స్ అన్నీ బ్యాలెన్సింగ్ చేస్తున్నాయిప్పుడు.