హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో 21 ఏళ్ల యువ ఆటగాడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. బ్రియాన్ బెన్నెట్. ఈ జింబాబ్వే యువ ఓపెనర్.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. బెన్నెట్ తన బ్యాట్‌తో ఏకంగా 169 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో జింబాబ్వే 299 పరుగులు చేసింది. 103 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు బెన్నెట్.
బెన్నెట్ తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 20 ఫోర్లు బాదేశాడు. అంటే అతడు తన ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలోనే 98 పరుగులు చేశాడు. బెన్నెట్ ఒక్కడే కాదు.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కూడా అర్ధ సెంచరీ సాధించాడు. అతడు 61 బంతుల్లో 66 పరుగులు చేశాడు. జింబాబ్వే మిడిల్ ఆర్డర్ మాత్రం విఫలమైంది. సికందర్ రాజా 8 పరుగులు చేయగా, మాధవీరే కూడా 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఎర్విన్, బెన్నెట్ కారణంగా జింబాబ్వే 299 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.
బ్రియాన్ బెన్నెట్ రికార్డు..
ఐర్లాండ్‌పై బ్రియాన్ బెన్నెట్ 169 పరుగులు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ వన్డేలో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన జింబాబ్వే ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డు ఇంతకముందు పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. ఈ ఐరిష్ ఆటగాడు కేవలం 20 సంవత్సరాల 4 రోజుల వయసులో 150 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు ఆ రికార్డును బెన్నెట్ బద్దలు కొట్టాడు. జింబాబ్వే తరపున వన్డే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా బ్రియాన్ బెన్నెట్ సాధించాడు. ఈ ఆటగాడు 21 సంవత్సరాల 96 రోజుల వయసులో సెంచరీ కొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..