పన్ను చెల్లింపుదారులకు అదిరేపోయే శుభవార్త

పన్ను చెల్లింపుదారులకు అదిరేపోయే శుభవార్త


ఈ పరిణామం ఐటీఆర్‌ ప్రాసెసింగ్‌ విషయంలో పెను మార్పేనని చెప్పొచ్చు. గతంలో రీఫండ్స్ వచ్చేందుకు 3 నెలలకు పైగా టైం పట్టేది. కాగా, ఇప్పుడది గంటల వ్యవధికి తగ్గిపోవటం.. ఇన్‌కమ్ ట్యాక్స్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ (2025-26)లో పలువురు తమ ఐటీఆర్ ఫైల్ చేసిన 4 గంటల్లోపే తమ బ్యాంకు ఖాతాల్లో రీఫండ్ జమ కావడాన్ని గమనించారు. పదేళ్ల క్రితం ఐటీఆర్ ఫైల్ చేసిన 3 నెలల తర్వాతే రీఫండ్ వచ్చేది. ఆ సమయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొత్త టెక్నాలజీ రాకతో.. ఐటీఆర్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. డిజిటల్ ప్రాసెస్ ద్వారా నెలలు, రోజుల నుంచి తాజాగా గంటలకు అది తగ్గింది. ఎంతవేగంగా ఐటీఆర్ ఫైల్ చేస్తే అంతే వేగంగా రీఫండ్ బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి చెందిన ఇ-ఫైలింగ్ పోర్టల్ (e-filing Portal)లో ఐటీఆర్ సబ్మిట్ చేసిన 4 గంటలలోనే తనకు రీఫండ్ అందినట్లు నోయిడాకు చెందిన అరుణ్ ప్రకాశ్ మీడియాకు తెలిపారు. ‘తాను ఐటీఆర్ ఫారం 1 ఉపయోగించి సాయంత్రం 5.03 గంటల సమయంలో రిటర్న్స్ ఫైల్ చేశానని, అదే రోజు రాత్రి 9.02 గంటలకు తన బ్యాంకు ఖాతాలోకి రీఫండ్ జమ అయిందని తెలిపారు. అందుకు సంబంధించి సమయాన్ని సూచించేలా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అదే రోజు రీఫండ్ జారీ కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనివల్ల ఐటీ రిటర్నులు పెరుగుతాయని, టాక్స్ సిస్టమ్ మీద పన్నుచెల్లింపు దారులకు నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే గడువు తేదీ వరకు వేచి చూడకుండా అన్ని వివరాలు సరి చూసుకుని రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KohiNoor: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

భార్యాభర్తల కోసం బెస్ట్‌ పోస్టాఫీస్‌ సేవింగ్స్ స్కీమ్‌..! రూ.13 లక్షలు మీ సొంతం

దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. ఆ తర్వాత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *