బీహార్‌లోని వైశాలి జిల్లాలో పాములను రక్షించడంలో నిపుణుడైన జె.పి. యాదవ్ విషపూరిత పాము కాటు కారణంగా మరణించాడు. హాజీపూర్‌లోని చక్ సికందర్ బజార్‌లోని ఒక గిడ్డంగి నుండి విషపూరిత పామైన గెహున్మాన్‌ను రక్షించడానికి యాదవ్‌ను పిలిచారు. అతను గిడ్డంగిలో పామును పట్టుకున్నాడు. దాన్ని బహిరంగ ప్రదేశంలో బయటకు తీసుకువచ్చాడు. జె.పి. యాదవ్ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషపూరిత పాము అతన్ని చాలాసార్లు కాటేయడానికి ప్రయత్నించింది, కానీ అతను తప్పించుకున్నాడు.
జె.పి. తన చేతిలో ఉన్న పాముతో ఆడుకుంటుండగా, ఆ పాము వెనక్కి తిరిగి అతని వేలిపై కాటేసింది. ఆ తర్వాత అతను మందు కోసం పిలుస్తూనే ఉన్నాడు, తన మణికట్టును కట్టమని వేడుకుంటూనే ఉన్నాడు, కానీ జనసమూహంలో ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పాము అతన్ని కరిచిన తర్వాత కూడా జె.పి. యాదవ్ పామును పట్టుకుంటూనే ఉన్నాడు.
పామును ఒక పెట్టెలో వేస్తుండగా విషం అతని శరీరంలోకి వ్యాపించింది. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సమీపంలో నిలబడి ఉన్న పోలీసులు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కొంత సమయం తర్వాత స్థానికులు అతన్ని హడావిడిగా హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి, మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. పాపం యాదవ్ అప్పటికే మరణించాడు. పాములు పట్టుకోవడానికి జెపి చాలా దూరం వెళ్ళేవాడు. ఇప్పటివరకు వందలాది విషపు పాములను రక్షించాడు. ఒక పాము నుండి మరొకరి ప్రాణాన్ని కాపాడుతూ అతనే మరణించాడు. జెపి యాదవ్ ఒక రైతు. జెపికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని సమాచారం.
बिहार के वैशाली में सर्प मित्र के नाम से चर्चित जेपी यादव की सांप काटने से मौत हो गई।
राजापाकर इलाके में एक सांप निकला था, जिसे पकड़ने के लिए उन्हें बुलाया गया था।
सांप पकड़ने के दौरान ही जेपी यादव जमीन पर लुढ़क गए और उनकी मौत हो गई। घटना का वीडियो वायरल हो रहा है।#JPYadav… pic.twitter.com/aVdWaED7DR
— Vinay Saxena (@vinaysaxenaj) July 7, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి