ఇంత ఆరోగ్యకరమైన కూరగాయ అయినా కొందరికి తినకూడని పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీలు అధిక మోతాదులో బీట్‌రూట్ తీసుకోవడం వల్ల తలనొప్పి, నీరసం, కడుపులో అసహజమైన భావన వచ్చే అవకాశం ఉంది. కనుక గర్భిణీలు దీనిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
పిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు చాలా మంది తల్లిదండ్రులు బీట్‌రూట్‌ని పరిచయం చేస్తారు. అయితే మూడు నెలలలోపు పిల్లలకు దీన్ని ఇవ్వడం వల్ల నైట్రేట్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు తినిపించే ముందు వారికి సరిపోతుందా..? లేదా..? అనే విషయంలో వైద్య నిపుణుల సూచన తీసుకోవడం అవసరం.
కొంతమంది బీట్‌రూట్ వాసనని పీల్చినా తిన్నా అలర్జీకి గురవుతారు. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వెంటనే రావచ్చు. అలాంటి వారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది. ముఖ్యంగా దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట నెప్పి, అసౌకర్యంగా అనిపించవచ్చు.
బీట్‌రూట్‌లో క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నప్పటికీ ఇది కొంతమంది రోగులకు అనుకూలించకపోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక దీనిని డాక్టర్ సూచించిన పరిమాణంలోనే తీసుకోవాలి.
బీట్‌రూట్‌లో లోహాల ఉనికి ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ పై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అధికంగా ఉండే ఆక్సలేట్స్ మూత్రంలో విడుదలై కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం ఉత్తమం.
బీట్‌రూట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ కొంతమందికి దీని ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. గర్భిణీలు, చిన్న పిల్లలు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దీన్ని తీసుకునే ముందు తప్పక వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా ఆహార పదార్థాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)