ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక.. టన్నుల కొద్దీ బంగారం, ప్లాటినం నిల్వలు సహా మరెన్నో ప్రత్యేకతలు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక.. టన్నుల కొద్దీ బంగారం, ప్లాటినం నిల్వలు సహా మరెన్నో ప్రత్యేకతలు..


ఒక లగ్జరీ నౌక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం, ప్లాటినంతో మెరిసే ఈ 100 అడుగుల నౌక విలువ కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్ పేరు హిస్టరీ సుప్రీం. దీని ధర, ఇందులో లభించే విలాసవంతమైన సౌకర్యాల కారణంగా ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పడవ హోదాను దక్కించుకుంది. ఈ పడవను దాదాపు 3.8 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 400 బిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఈ పడవలోని అలంకరణలు, విలాసం, ప్రత్యేకతలు దాని హుందా తనానికి అద్దం పడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ నౌక ప్రపంచ పర్యాటకులతో పాటు, ఎంతో మందిని తనవైపు ఆకర్షిస్తుంది.

నివేదిక ప్రకారం, ఈ పడవ యజమాని 101 ఏళ్ల మలేషియా వ్యాపారవేత్త రాబర్ట్ కుయోక్. ఈ పడవలో దాదాపు 1 లక్ష కిలోగ్రాముల (99 టన్నులు) బంగారం, ప్లాటినం నిల్వలు ఉన్నాయి. యాంకర్ నుంచి డైనింగ్ ఏరియా వరకు యాచ్‌లోని ప్రతి భాగాన్ని కవర్ చేయడానికి సుమారు 100 టన్నుల బంగారం, ప్లాటినం‌ను ఉపయోగించారు. హిస్టరీ సుప్రీమ్‌ కేవలం నౌక మాత్రమే కాదు, ఇది విలువైన లోహాలు, అరుదైన కళాఖండాల ప్రదర్శనకు ఒక వేదికగా మారింది.

ఇది మాత్రమే కాదు, మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉల్క శిలలతో గోడలు, టైరన్నోసారస్ రెక్స్ ఎముకల నుంచి చెక్కిన విగ్రహం ఉన్నాయి. సూట్‌లో 18.5 క్యారెట్ల డైమండ్ పొదిగిన మద్యం సీసా, 24 క్యారెట్ల బంగారు ఫ్రేమ్‌తో కూడిన 68 కిలోల అక్వేరియం కూడా ఉన్నాయి. ఈ భారీ పడవను బ్రిటిష్ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ రూపొందించారు. 100 అడుగుల పొడవైన ఈ పడవను నిర్మించడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ పడవ పాత్ర దాని బేస్ చుట్టూ నిజమైన బంగారంతో పూత పూయబడింది.

ఇవి కూడా చదవండి

Supreme Yacht

ఇకపోతే, ఈ పడవలో ఎన్ని గదులు ఉన్నాయో మాత్రం తెలియదు.. అయితే, దీనికి 3D స్క్రీన్‌తో కూడిన సినిమా థియేటర్, క్రిస్టల్ షాన్డిలియర్‌లతో కూడిన డైనింగ్ ఏరియా ఉందని సమాచారం. పడవలోని నీటి అడుగున భాగంలో హెలిప్యాడ్, వైన్ సెల్లార్, కిటికీలు కూడా ఉన్నాయని సమాచారం.ఈ హిస్టరీ సుప్రీంను రాబర్ట్ కుయోక్ నిర్మించినట్లు తెలుస్తోంది. కుయోక్ ప్రపంచంలోని 96వ ధనవంతుడు. అతను మలేషియాలో అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ £9.3 బిలియన్లు (సుమారు రూ. 1 లక్ష కోట్లు) ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *