ఫేమ్ కోసం రీల్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యారు..

ఫేమ్ కోసం రీల్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యారు..


ఫేమ్ కోసం రీల్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. కట్ చేస్తే.. అడ్డంగా బుక్కయ్యారు..

ఫేమ్‌ కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు కన్నడ బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు.. కన్నడ బిగ్‌ బాస్‌లో రజత్‌ , వినయ్‌కు ఎంతో పేరు వచ్చింది. అయితే పాపులారిటీ కోసం వాళ్లిద్దరు కలిసి ఓ రీల్స్‌ చేశారు. చేతిలో వేట కొడవలితో హీరోయిజయం ప్రదర్శించారు. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హింసను రెచ్చగొట్టే విధంగా రీల్స్‌ను చేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు రజత్‌ , వినయ్‌ను అదుపు లోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే అది అసలు వేట కొడవలి కాదని , డమ్మీ అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు . ఇన్‌స్టాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయడంతో చాలామంది చూశారు. హింసను ప్రేరేపించే విధంగా ఈ వీడియో ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియోలో పోస్ట్‌లు పెట్టేముందు సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడం నేరమే అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు. డేంజర్‌ క ఆయుధాన్ని పట్టుకుని దాదాపు 18 సెకన్ల వీడియోను ఇద్దరు తయారు చేశారని FIRలో పేర్కొన్నారు. దీనిని బుజ్జి పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ జంటలో, బిగ్ బాస్ కన్నడ సీజన్ 10 లో టాప్-ఫోర్ కంటెస్టెంట్‌గా గౌడ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయ్యాడు . కిషన్ బిగ్ బాస్ సీజన్ 11 యొక్క గ్రాండ్ ఫినాలే రౌండ్‌కు చేరుకున్నాడు. కాని ఇప్పుడు ఇద్దరు కూడా ఒక్క వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యారు. తాము చేసింది తప్పే అని ఇద్దరు ఒప్పుకున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *