మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ రోజు అంటే ఫిబ్రవరి 15న భారత ఆటగాళ్లు దుబాయ్‌కి వెళ్లనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎలాగైన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఆటగాళ్లంతా ఉన్నారు. అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా టీమిండియా ఎలాగైనా కప్పు కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కప్పు కొడితే బాగుటుందని అనుకుంటున్నారు. అయితే జట్టులో స్పీడ్‌స్టర్, మ్యాచ్ విన్నర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం క్రికెట్ అభిమానులతో పాటు జట్టులోని ఆటగాళ్లను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. వెన్ను గాయంతో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో కొత్త కుర్రాడు హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వౌడ్‌లోకి తీసుకున్నారు.
అయితే బుమ్రా పూర్తిగా కోలుకున్నప్పటికీ అతన్ని కావాలనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించినట్లు సమాచారం. దాని వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్లాన్ ఏంటి? బుమ్రాను ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడం లేదు? అనే ఇప్పుడు తెలుసుకుందాం.. బుమ్రా వెన్ను నొప్పితో బాధ పడుతున్న మాట వాస్తమే, కానీ, ఆ గాయం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు, అతనికి ఏ సమస్య లేదని బెంగళూరులోని ఎన్‌సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) మెడికల్ టీమ్ తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కూడా భారత సెలక్టర్లు, ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరంగా ఉంచాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐది కూడా అదే నిర్ణయమని సమాచారం. మరి బుమ్రా సెట్ అయినా కూడా అతన్ని ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడం లేదంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు బుమ్రా పూర్తి స్థాయిలో, తన సామర్థ్యం మేరకు బౌలింగ్ చేయలేడని బీసీసీఐ భావిస్తోంది.
అలాగే టెస్ట్ ఫార్మాట్‌లో ఫేలవ ప్రదర్శన కనబరస్తున్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, బుమ్రాను ఆ బాధ్యతలు అప్పగించాలని కూడా బీసీసీఐ పెద్దలు బలంగా ఫిక్స్ అయ్యారు. ఇక రాబోయే టెస్ట్ సిరీస్‌ల్లో రోహిత్ శర్మను కనీసం టీమ్‌లోకి తీసుకోవాలని కూడా బీసీసీఐ కానీ, సెలెక్టర్లు కానీ అనుకోవడం లేదంట. అందుకే ఇప్పుడిప్పుడే కోలుకున్న బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించి, అతను మళ్లీ గాయపడితే.. రోహిత్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు ఎవరికీ ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో.. రాబోయే టెస్ట్ సిరీస్‌ల్లో టీమిండియాను బుమ్రా సమర్థవంతంగా నడిపించాలంటే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను దూరం పెట్టాలని బీసీసీఐ, సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. బుమ్రా లాంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్ టీమ్‌లో లేకుంటే భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం కూడా క్లిష్టంగా మారుతుంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని భావిస్తున్న ఫ్యాన్స్‌కు ఇది ఎదురుదెబ్బ. అలాగే రోహిత్‌ను పూర్తిగా టెస్ట్ ఫార్మాట్‌కు దూరం చేయడం కూడా హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.