
జో బైడెన్ దేశ రహస్య సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం జో బైడెన్ రహస్య సమాచారం పొందాల్సిన అవసరం లేదు. అందువల్ల మేము వెంటనే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నాం. ఆయన రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నాం. 2021లో నాకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నుంచి జాతీయ భద్రతా సమాచారం తెలుసుకోవడాన్ని నిలిపివేశారు.