ఏ వ్యక్తికైనా వివాహం చాలా ప్రత్యేకమైనది. తన జీవితాన్ని ఎవరితోనైనా ముడిపడబోతున్నప్పుడు ఆ రోజును వేడుకగా జరుపుకుంటాడు, కానీ మీరు ఎప్పుడైనా విడాకులను జరుపుకునే వారిని చూశారా?
ఏ వ్యక్తికైనా వివాహం చాలా ప్రత్యేకమైనది. తన జీవితాన్ని ఎవరితోనైనా ముడిపడబోతున్నప్పుడు ఆ రోజును వేడుకగా జరుపుకుంటాడు, కానీ మీరు ఎప్పుడైనా విడాకులను జరుపుకునే వారిని చూశారా?
ఈ విషయాన్ని ఆమె కుమార్తె ఫియా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నా తల్లి 30 సంవత్సరాల భయంకరమైన వివాహ బంధాన్ని భరించిన తర్వాత చివరకు విముక్తి పొందింది అని పేర్కొంది. మేం కేక్ కట్ చేసి ఈ క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని తెలిపింది.
ఫియా ప్రకారం.. ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన దశాబ్దం తర్వాత విడాకులు తీసుకున్నారు. అనేక సార్లు ఆయుధాలతో తమను బెదిరింపులకు గురి చేసి వేధించినట్లు వాళ్లు తెలిపారు.
ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత చాలా మంది దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. అందరి ముందు ఈ విధంగా విడాకులను జరుపుకోవడం తప్పు అని అన్నారు. అదే సమయంలో కొంతమంది ఇస్లామిక్ బోధనలను ఉటంకిస్తూ విడాకులు ఆమోదయోగ్యం కాని చర్య అని అన్నారు.