భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య..ఏం జరిగిందో తెలిస్తే షాక్

భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య..ఏం జరిగిందో తెలిస్తే షాక్


కుటుంబ కలహాలతో భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని కాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పుట్టింట్లో ఉన్న భార్యకు భర్త అజయ్ వీడియో కాల్ చేశాడు. ఆమెను తిరిగి రావాలని కోరాడు. దానికి భార్య నిరాకరించడంతో..ఆమె చూస్తుండగానే కత్తితో 18 సార్లు కడుపులో పొడుచుకొని..గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వేధింపులు భరించలేకే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్‌ ప్రదేశ్‌ కాన్పూర్‌లోని యోగేంద్ర విహార్‌లో నివాసముంటున్న రామ్‌బాబుకు నలుగురు కుమారులు రాజు, గోవింద్, బాబు, దినేష్( అలియాస్ అజయ్ బజరంగీ). జూన్ 22, 2023న ధరుపూర్‌కు చెందిన రాధ అనే యువతితో అజయ్‌కు వివాహం జరిగింది. అయితే వివాహం తర్వాత తాము వేరే కాపురం పెడదామని అజయ్ పై భార్య ఒత్తిడి తీసుకురావడంతో..బారావీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం కొనసాగిస్తున్నారు. అయితే కొన్నాళ్లకు వీరిద్దరికి ఓ పిల్లాడు పుట్టాడు. పెళ్లైనప్పటి నుంచి భార్య ఎక్కువగా ఫోన్‌ వాడుతూ ఉండేది..ఈ విషయం అజయ్‌కు అస్సలు నచ్చేది కాదు..అజయ్ ఎన్ని సార్లు చెప్పినా ఆ అలవాటును మాత్రం మానుకోలేదు..పిల్లాడు పుట్టాక కూడా రాధ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అజయ్, రాధ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా తీవ్రతరం కావడంతో రాధ వాళ్ల పుట్టింటికి వెళ్లి పోయింది. అజయ్ కూడా అక్కడ నుంచి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అయితే తిరిగి రావాలని రాధకు అజయ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె పట్టించుకునేది కాదు.. తన కొడుకును చూడాలనుందని..ఇంటికి తిరిగి రమ్మని రాధకు అజయ్ గురువారం మరోసారి కాల్ చేశాడు. దానికి రాధ నిరాకరించింది. కనీసం వీడియో కాల్‌లోనైనా కొడుకుని చూపించాలని అజయ్ కోరాడు. అది కూడా కుదరదని రాధ తేల్చి చెప్పింది..ఇక జన్మలో నువ్వు నీ కొడుకుని చూడలేవని..మీ ఫ్యామిలీ మొత్తం మీద వరకట్న వేధింపుల కేసు పెడతానని హెచ్చరించింది. దీంతో మస్తాపానికి గురైన అజయ్..భార్య చూస్తుండగానే కత్తి తీసుకొని కడుపుతో 18 సార్లు పొడుచుకొని, గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దాన్ని గమనించిన అజయ్ కుంటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అజయ్ ను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

అజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ డీసీపీ దీపేంద్ర నాథ్ చౌదరి మరియు సౌత్ ఏడీసీపీ మహేష్ కుమార్..ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *