మద్యం ఆరోగ్యానికి హానికరం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మద్యం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే, అనేక చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, గంటల తరబడి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ మద్యం ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు.. మరి కొందరు మద్యం ప్రియులు మాత్రం.. ఎలాంటి అడ్డు అదుపులేకుండా, ఏది తాగుతున్నామనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు మిక్స్ చేసి కొట్టేస్తుంటారు.. అయితే కొందరు మాత్రం బీర్‌లో విస్కీ, వైన్ కలుపుకొని తాగుతుంటారు. అలా తాగడం వల్ల ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా? అలా తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం
వైన్, బీరు కలిపి తాగడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు డ్రింక్స్ కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇది మానవ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆ వ్యక్తి త్వరగా మత్తులో మునిగిపోతాడని చెప్పారు. చివరికి, వారు హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతారు.
అంతేకాదు.. బీరు, వైన్ లేదా విస్కీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తాగి పడుకుంటే, ఉదయం శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, అది శరీరం నుండి నీటిని బయటకు లాగుతుంది.
ఇవి కూడా చదవండి
విస్కీ, బీరు కలిపి తాగడం వల్ల వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఛాతీలో మంట పెరుగుతుందని చెబుతున్నారు.. ఇది గుండెల్లో మంటకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. బీరు, విస్కీ కలిపి తాగడం వల్ల మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..