
ఇద్దరిని క్రూరంగా హత్య చేసిన ఘటనలో ఓ నరరూప రాక్షసుడు పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో అతడొక సీరియల్ కిల్లర్ అని, అతడు మనుషుల్ని చంపిన విధానం చెప్పగా పోలీసులకు సైతం చమటలు పట్టాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతడి బావమరిది బక్ష్‌రాజ్‌కు పాతికేళ్ల తర్వాత కోర్టు తాజాగా జీవితఖైదు విధించింది. లక్నో కోర్టు శుక్రవారం (జులై 23) వీరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. జడ్జి శిక్ష విధిస్తున్న సమయంలో కోలందర్.. కోర్టు గదిలో నవ్వుతూ కనిపించడం మరో వింత. ఎటువంటి పశ్చాత్తాపం, భయం, బాధ అతడి ముఖంలో వీసమెత్తైనా కనిపించకపోవడం విశేషం.
2000 కరోనా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్టు ధీరేంద్రసింగ్ (22), అతడి డ్రైవర్ రవి శ్రీవాస్తవను అతి క్రూరంగా హత్య చేసిన కేసులో కోలందర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఇతడి నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ధీరేంద్రసింగ్ హత్యకేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కోలందర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లగా అక్కడ మనుషుల పుర్రెలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోలందర్‌ను ప్రశ్నించగా.. వారందరినీ తానే హత్య చేశానని, మనుషుల తలలతో సూప్ చేసుకుని తిన్నానని, అది తనకు చాలా ఇష్టమని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. జర్నలిస్ట్ ధీరేంద్రను పిప్రీలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి చంపినట్లు తెలిపాడు. తలలు వేరు చేసి, శరీర భాగాలు ముక్కలు చేసి పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. ఇతడి ఇంట్లో 14 హత్యలు చేసినట్లు డైరీలో రాసుకున్నాడు.
కాగా కొలందర్ ప్రయాగ్‌రాజ్ నివాసి. కోల్ తెగకు చెందిన అతను ఒకప్పుడు రాష్ట్రంలోని ఒక ఆయుధ కర్మాగారంలో ఉద్యోగం కూడా చేశాడు. తనను తాను రాజుగా చెప్పుకుంటూ, తనకు నచ్చని ఎవరినైనా శిక్షించే హక్కు తనకు ఉందని రాజా కోలందర్ చెప్పేవాడు. అతను తన భార్యను ఫూలన్ దేవి అని, కొడుకుకు అదాలత్‌ను జమానత్ అని పిలిచేవాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.