నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు అతడి డైరీల్లో చూసి అధికారులు షాకయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయెల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. అతడి పాపాల చిట్టా బయటపడింది. అయితే, బాధితుల్లో చాలామందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం గమనార్హం. జోయెల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా.. తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసి కూడా అలా ప్రవర్తించానని, తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నాననిజోయెల్ తెలిపాడు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న కోర్టు ఇతనికి ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో