ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. కాని పచ్చని సంసారంలో డ్రగ్స్ చిచ్చుపెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి.. డ్రగ్స్ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను ముస్కాన్ అనే మహిళ అత్యంత పాశవికంగా హతమార్చింది. అయితే, అల్లుడు చాలా మంచివాడని, సౌరభ్‌ను చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేయడం మరో సంచలనం.. లేదంటే తామే ముస్కాన్‌ను చంపేస్తామని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య దారుణంగా హత్య చేయడం సంచలనం రేపింది. సౌరభ్ డెడ్‌బాడీని ప్రియుడు సాహల్‌తో కలిసి 15 ముక్కలు చేసి డ్రమ్ములో పూర్తిగా సిమెంట్‌తో నింపి దాచేశారు. మార్చి 4వ తేదీన సౌరభ్‌ను హత్య చేసి శవాన్ని డ్రమ్ములో దాచేశారు దుండుగులు. తన ప్రియుడు సాహిల్ కోసం ముస్కాన్ సౌరభ్‌ను దారుణంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. అతని శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. దానిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో నింపేశారు. హత్య తర్వాత, వారిద్దరూ ఇంట్లో హాయిగా నిద్రపోయారు.
లండన్‌లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్ కొద్దిరోజుల క్రితమే స్వస్థలం మీరట్‌కు వచ్చాడు. మార్చి 4వ తేదీ నుంచి అతడు అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అయితే ముస్కాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. తన కూతురు అల్లుడిని హత్య చేసనట్టు తనతో చెప్పినట్టు ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆమె చేసిన నేరం క్షమించరానిది. ఆమెకు మరణశిక్ష పడకపోతే, తామే ఆమెను చంపేస్తామన్నారు. ముస్కాన్‌ను మాదకద్రవ్యాలకు బానిసను చేసింది సాహిల్. ఇద్దరినీ ఉరితీయాలి. ముస్కాన్ ఇలాంటిది చేసిందని మేము ఎప్పుడూ ఊహించలేదన్నారు ఆమె తల్లి.
సౌరభ్‌ను హత్య చేసిన తరువాత ముస్కాన్‌తో తన ప్రియుడు సాహిల్‌తో కలిసి హిమాచల్ హిల్‌స్టేషన్‌కు వెళ్లింది. ఎవరికి అనుమానం రాకుండా సౌరభ్ ఫోన్‌ను తానే లిఫ్ట్ చేసింది. చివరిక ముస్కాన్ నివాసం నుంచి డ్రమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌరభ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
2016లో ముస్కాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌరభ్ రాజ్‌పుత్.. వాళ్లిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. మర్చంట్ నేవీ ఉద్యోగం కావడంతో ఎక్కువ కాలం సౌరభ్ సముద్రంలోనే గడిపాడు. సౌరభ్ జనవరిలో లండన్ నుండి తిరిగి వచ్చాడు. ముస్కాన్, సాహిల్ ప్రేమ వ్యవహారం గురించి అతనికి తెలియజేసి విడాకులు కోరారు. కానీ సౌరభ్ నిరాకరించాడు. తన కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. దీని తరువాత ముస్కాన్, సాహిల్ అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేశారు. అతను అప్పటికే జంక్ మార్కెట్ నుండి ఒక ప్లాస్టిక్ డ్రమ్, ఝండా చౌక్ నుండి సిమెంట్ కొని, పిండి నిల్వ చేసే నెపంతో ఇంట్లో ఉంచారు. వాళ్లిద్దరు కలిసి సౌరభ్‌ను హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది.
హత్య తర్వాత, దుర్వాసన వ్యాపించడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డ్రిల్ మెషిన్‌తో డ్రమ్‌ను కోయడానికి ప్రయత్నించారు. కానీ సిమెంట్ చాలా గట్టిగా మారింది. దానిని కత్తిరించలేకపోయింది. చివరికి, డ్రమ్‌ను పోస్ట్‌మార్టం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు యంత్రాలను ఉపయోగించి సిమెంట్‌ను పగలగొట్టి మృతదేహాన్ని తొలగించారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిపై చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..