
ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని ఒక్కసారిగా పెంచేస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది హానికరంగా మారుతుంది. అంతేకాదు కొన్ని సిట్రస్ పండ్లు, పేగులలో మంట, గ్యాస్ మలబద్ధకాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఫలాల్ని మితంగా సమతుల్యంగా తీసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన చాలామందికి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా అనిపిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం అధికంగా గ్రీన్ టీ తీసుకుంటే మూత్రపిండాలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి, హృదయ స్పందనలో మార్పులు, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. అందుకే మితంగా తీసుకోవాలి. కాఫీ లేదా టీ మితంగా తీసుకుంటే శరీరానికి ఉత్తేజాన్ని శక్తిని ఇస్తాయి. కానీ అధికంగా తాగితే నిద్రలేమి, మానసిక ఆందోళన, గుండె దడ పెరగడం, జీర్ణక్రియపై ప్రభావం చూపడం వంటి ప్రతికూలతలు ఉండవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆమ్లం ఉత్పత్తి అధికమై గ్యాస్ట్రిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. ఎటువంటి అలవాటు అయినా ఆరోగ్యానికి మేలు చేయాలంటే దానిని సరైన పద్ధతిలో మితంగా అనుసరించటం తప్పనిసరి. మంచిగా అనిపించే అలవాట్లు కూడా ఎక్కువైతే ముప్పుగా మారవచ్చు. అందుకే నీరు, ఫలాలు, గ్రీన్ టీ, కాఫీ వంటి వాటిని శరీర అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలి.