
చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి కొంతమంది, మొక్కలు పెంచడం హాబీగా ఉన్న వారు ఇలా కారణం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిగా కాక్టస్ మొక్కను ఇంటి లోపల పెంచడం మంచిది కాదు. ఈ మధ్య కాలంలో ఈ కాక్టస్ మొక్కను చాలా మంది చిన్న చిన్న కుండీల్లో ఇళ్లలో పెంచుకుంటున్నారు. కాక్టస్ మొక్కను తెలుగులో బ్రహ్మజముడు అని కూడా ఉంటారు. ఇది సాధారణ ఎడారుల్లో పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎడాది మొక్క అని కూడా అంటారు. అయితే.. ఈ మొక్క ఇంట్లో ఉండటం అందరికీ అంత శ్రేయస్కరం కాదు. దీని వల్ల నెగిటివిటీ పెరుగుతుంది.
అందుకే ఈ మొక్క మీ ఇంట్లో కూడా ఉన్నట్లేయితే అర్జెంట్‌గా దాన్ని తీసేయండి. మరో మొక్క చింత మొక్క. దీన్ని సాధారణంగా ఎవరు పెద్దగా ఇంట్లో పెంచుకోరు. కానీ పొరపాటున ఉంటే మాత్రం వెంటనే తీసేయండి. ఈ రెండు రకాల మొక్కలు ఉంటే ఇంట్లో అశాంతి, గొడవలు వస్తూ ఉంటాయి. ఏ మొక్కలు ఉండకూడదో చెప్పుకున్నాం.. ఇప్పుడు ఏ మొక్కలు ఉంటే మంచిదో చూద్దాం.. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్, బాంబో ప్లాంట్స్‌ను ఇంట్లో పెంచుకుంటే మంచిది. ఈ రెండు మొక్కల వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ మొక్కలను ఏ ప్లేస్‌లో పెట్టాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. నార్త్-ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్యంలో ఈ రెండు రకాల మొక్కలు ఉంచితే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో మొక్కలు పెంచాలి అనుకుంటే ఈ రెండు రకాల మొక్కలు తెచ్చుకోండి.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)