మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..


తాజాగా మన దేశ 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ తనది భారత్ DNA అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ విషయం తేలిందని అన్నారు. దీంతో, ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనలా మన డీఎన్‌ఏ గురించి కూడా తెలుసుకోవచ్చా. యస్.! బేషుగ్గా.. మీ ముందు తరాలు ఎక్కడ నివసించేవారు. మీ పుట్టుపూర్వోత్తరాల హిస్టరీ అంతా ఒక టెస్టుతో తెలుసుకోవచ్చట.

మనం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో నివశిస్తున్నప్పటికీ మన పూర్వికులు ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి మైగ్రేట్ అయినవారు కావొచ్చు. అలా మీకున్న వివిధ రకాల బాడీ ఫీచర్స్.. మీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుంది..? మీకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎందుకు ఉన్నాయి వంటి అన్ని వివరాలు తెలుసుకోడానికి DNA Ancestry Test చేయించుకోవచ్చు. దీని సహాయంతో మన పూర్వికులు ఏ ప్రాంతంవారో కూడా విశ్లేషిస్తారు.

భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ తరహా టెస్టులు చేసే సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షతో 500 ఏళ్ల పాటు మీ పూర్వికుల డేటాను ఈజీగా విశ్లేషించవచ్చు. 1000 ఏళ్ల దాటి పోయి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. మీ మూలల గుట్టు విప్పొచ్చు. అంతే కాదండోయ్.. మీ బాడీలో నియాండర్తల్ DNA పర్సంటేజ్ ఎంత ఉంది? లాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మొత్తంగా 60 నుంచి 70 రకాల రిపోర్టులు ఈ టెస్టు ద్వారా వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ వాళ్లు Gene 2.o పేరుతో గతంలో ఈ టెస్టులు నిర్వహించేవారు. ఇప్పుడు వేరే సంస్థలు కూడా ఈ పరీక్షలు చేస్తున్నాయి. మీరు కూడా మీ పూర్వికులు తాలూకా ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ టెస్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *