మొదటి నెలలోనే రికార్డు సృష్టించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు

మొదటి నెలలోనే రికార్డు సృష్టించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు


భారత రైల్వేలు ఎల్లప్పుడూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీకి వెన్నెముకగా ఉన్నాయి. ప్రయాణికులను చేరవేయడంతో, సుదూరాలకు వస్తువుల తరలింపును సులభతరం చేయడంలో ఇది ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కసారి మన రైల్వే గనక ఆగితే.. టోటల్ భారత దేశమే స్తంభించిపోతుంది. అంతటి శక్తివంతమైన వ్యవస్థ మన రైల్వే వ్యవస్థ. రైలు అన్నది కేవలం ప్రయాణికులను చేరవేసే యంత్రం కాదు. అది మన దేశం గుండె చప్పుడు. సిగ్నల్ లైట్ల మధ్య, గ్రామాల నుంచి నగరాలకు, సముద్ర తీరాల నుంచి హిమాలయాలకు, ఒక మనసును మరొక మనసుతో కలుపుతూ సాగుతుంది.

ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వివిధ రకాల రైళ్లు నడుస్తాయి. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. రైల్వేలు ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లను నడుపుతున్నాయి. వీటిలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని కూడా ప్రారంభించింది. దీని కింద 1000 కి పైగా రైల్వే స్టేషన్లను హైటెక్‌గా మార్చనున్నారు. అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో కూడా ప్రైవేట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్. ఇది 2021లో భారత్ గౌరవ్ పథకం కింద ప్రారంభించింది. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు తేజస్ ఎక్స్‌ప్రెస్ దాదాపు రూ. 70 లక్షల లాభాన్ని ఆర్జించింది. టిక్కెట్ల అమ్మకం ద్వారా దాదాపు రూ. 3.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలు తమ మొదటి ప్రైవేట్‌గా నడిచే రైలుకు స్థిరమైన ప్రారంభాన్ని సూచిస్తోంది.

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) లక్నో-ఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ 50 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అభివృద్ధి చేసింది. ప్రైవేట్ ప్యాసింజర్ రైలు ఆపరేటర్లు దాని నెట్‌వర్క్‌లో 150 రైళ్లను నడపడానికి అనుమతించే రైల్వేల బిడ్‌ సాధించింది. అక్టోబర్ 5న ప్రారంభమైన దాని ఆపరేషన్ , రైలు సగటున 80-85 శాతం ఆక్యుపెన్సీతో నడిచిందని పేర్కొంది. అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 28 వరకు అంటే 21 రోజులు, రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది. రైలును నడపడానికి IRCTC చేసిన ఖర్చు దాదాపు రూ. 3 కోట్లు.

ఈ అత్యాధునిక రైలును నడపడానికి IRCTC రోజుకు సగటున రూ. 14 లక్షలు ఖర్చు చేస్తుంది. ప్రయాణీకుల ఛార్జీల ద్వారా రోజుకు దాదాపు రూ. 17.50 లక్షలు సంపాదిస్తుంది. లక్నో-ఢిల్లీ మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేయేతర ఆపరేటర్, దాని స్వంత అనుబంధ సంస్థ IRCTC నడుపుతోంది. IRCTC తన ప్రయాణీకులకు భోజనం, రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా, ఆలస్యం అయితే పరిహారం వంటి వివిధ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రైవేట్ రైలు కార్యకలాపాలు, స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులపై చొరవలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం గత నెలలో కార్యదర్శుల బృందంతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ బృందం మొదటి సమావేశం ఇంకా జరగలేదు.

గురువారం(ఏప్రిల్ 17) IRCTC షేర్లలో పెరుగుదల కనిపించింది. BSE డేటా ప్రకారం, IRCTC 1.20 శాతం పెరుగుదలతో రూ.769.65 వద్ద కనిపించింది. అయితే, ట్రేడింగ్ సెషన్ సమయంలో, కంపెనీ షేరు ఆ రోజు గరిష్ట స్థాయి రూ.770.75కి చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.61,572.00 కోట్లు. గత ఏడాది మే నెలలో కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,148.30కి చేరుకుంది. అప్పటి నుండి, కంపెనీ షేర్లు 33 శాతం తగ్గాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *