మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!


మోకాలి నొప్పిని ఫస్ట్ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజంగానే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బాడీకి సేఫ్ అయిన న్యాచురల్ ఆయిల్. ఇది వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. కొబ్బరి నూనెతో కలిపి వాడే కొన్ని సహజ పదార్థాలు మోకాలి నొప్పిని తగ్గించడంలో పక్కా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వగంధ పొడి

అశ్వగంధ పొడి బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో ఫేమస్. కొద్దిగా అశ్వగంధ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మోకాలిపై నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇది నొప్పిని తగ్గించడమే కాదు.. కండరాలకు శక్తి ఇవ్వడంలో కూడా సపోర్ట్ చేస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్ లో చల్లదనం, వాపు తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని ఫాస్ట్‌ గా తగ్గిస్తాయి. కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో కలిపి మోకాలిపై మర్దన చేస్తే చాలు.

కుంకుమపువ్వు

కొబ్బరి నూనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి గోరువెచ్చగా చేసి మోకాలిపై రాయండి. కుంకుమపువ్వులో ఉండే సహజ గుణాలు నొప్పిని తగ్గించి ఎనర్జీని అందిస్తాయి.

మెంతులు

మెంతులు వాపు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కొద్ది మెంతులను కొబ్బరి నూనెలో నానబెట్టి.. ఆ నూనెను కొద్దిగా వేడిచేసి మోకాలిపై మసాజ్ చేయండి. ఇది గట్టిపడిన కండరాలను నెమ్మదిగా రిలాక్స్ చేస్తుంది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె చర్మాన్ని తేమగా ఉంచడానికి యూజ్ అవుతుంది. కొబ్బరి నూనెతో సమానంగా నువ్వుల నూనె కలిపి మోకాలికి పూయడం వల్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.

ధనియాలు

ధనియాలు రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఒక స్పూన్ ధనియాలను కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను వడకట్టి మోకాలికి పూయండి. ఇది మోకాలిలో ఉన్న వాపును తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది.

కర్పూరం

పచ్చకర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని మోకాలిపై నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. మోకాలి నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది.

ఈ సులువైన చిట్కాలు మీ రోజువారీ మోకాలి నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని వరుసగా 10 నుంచి 15 రోజులు ట్రై చేసి ఫలితం చూడండి. ఒకవేళ ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే.. లేదంటే ఎరుపు, వాపు లాంటివి ఉంటే డాక్టర్‌ ను కలవడం కంపల్సరీ.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *