రచ్చ రంబోలా..! సినిమా కోసం బట్టలేకుండా నటించింది.. దెబ్బకు మూవీ అటకెక్కింది..

రచ్చ రంబోలా..! సినిమా కోసం బట్టలేకుండా నటించింది.. దెబ్బకు మూవీ అటకెక్కింది..


ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలన్నీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్స్ కూడా వ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్ తెరకెక్కనుంది. మొదటి భాగంగా ఘనవిజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఆ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?

ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో పిశాచి సినిమా ఒకటి.  ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇదొక హారర్ డ్రామా చిత్రం. పిశాచి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు

కాగా ఈ సీక్వెల్ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్ గా నటించారని తెలుస్తోంది. ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా నటించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్  పూర్తయ్యింది. అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. ఈ సినిమాను  విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది. ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *