పండ్లు ఆరోగ్యానికి మేలైనవి. అయితే రాత్రిపూట కొన్ని పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. కనుక రాత్రిపూట కొన్ని పండ్లు తినకుండా ఉండటం ఉత్తమం. అరటిపండు చక్కెర, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. కానీ రాత్రిపూట తింటే జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. శ్లేష్మం పెరగడం వల్ల గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నిద్ర కుదరదు. అందువల్ల రాత్రి సమయంలో అరటిపండు తినకపోవడం మంచిది.
ఆపిల్ రోజులో తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ రాత్రిపూట తింటే గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట కలుగుతుంది. షుగర్ స్థాయిలు పెరిగి నిద్రపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది అధికంగా బాధిస్తుంది.
సపోటా తీపి రుచితో ఉండి శక్తి కలిగించే పండు. కానీ రాత్రిపూట తింటే షుగర్ స్థాయి పెరుగుతుంది. శక్తి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర రాదు. అజీర్ణం ఏర్పడుతుంది. కనుక సపోటా పగలు తినడం ఉత్తమం.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట తింటే తరచూ మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. ఇందులో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఎక్కువై నిద్ర రాదు.
జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రాత్రిపూట తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. ఇందులో ఉన్న చక్కెర రక్తంలో షుగర్ పెంచుతుంది. కనుక గట్టి జామకాయ రాత్రిపూట తినకపోవడం మంచిది.
పైనాపిల్ ఆరోగ్యానికి మంచిది అయినా.. రాత్రిపూట తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లాంటి సమస్యలు కలిగిస్తుంది.
రాత్రిపూట తిన్నా ఇబ్బంది లేని పండ్లు కూడా ఉన్నాయి. చెర్రీస్, బెర్రీస్ వంటి పండ్లు సులభంగా జీర్ణమవుతాయి. ఇవి నిద్రను మెరుగుపరచగల లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక రాత్రి సమయంలో ఇవి తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)