గ్రహాల సంచారం లేదా కలయిక 12 రాశులను ప్రభావితం చేస్తుంది. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి వస్తే, మరికొన్ని రాశులకు ఆర్థిక సమస్యలు ఎదురు అవుతుంటాయి. అయితే 300 ఏళ్ల తర్వాత 3 గ్రహాలు, శని, బుధ, శుక్ర గ్రహాల కలయిక వలన మాలవ్య యోగం,భద్రయోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడ నుంది. దీని వలన ఏ రాశుల వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
వృశ్చిక రాశి: త్రిగ్రాహి యోగం వలన వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయానాలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. శుక్రుని ప్రభావం వల్ల సంపదలో భారీ పెరుగుదల ఉండబోతుంది.
మిథున రాశి : మిథున రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు వారు చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి సతమతం అవుతే వాటి నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.
తుల రాశి : త్రిగ్రాహి రాజయోగం వలన ఈ రాశుల ఇంట్లో సంపద వర్షమే కురుస్తుంది. వీరికి ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బుతో చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు అద్భుతంగా ఉండనుంది. అలాగే చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తుంటారు.
మేష రాశి :మేష రాశి వారికి త్రిగ్రాహి రాజయోగం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.