
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అప్పట్లో వచ్చిన శతమానం భవతి సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాడు ఈ కుర్ర హీరో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ లు మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక్క జీవితం సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత వరుసగా డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో ఈ మధ్య చిన్న గ్యాప్ ఇచ్చాడు. దాదాపు ఏడాది క్రితం మనమే అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఇంతవరకు ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. ఏడాది అయినా కూడా సినిమా ఓటీటీకి రాకపోవడంతో ప్రేక్షకులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికి ఎట్టకేలకు మనమే సినిమా ఓటీటీలోకి రానుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా గత ఏడాది జూన్ లో థియేటర్స్ లో విడుదలైంది. కానీ సినిమా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఓటీటీలోకి మాత్రం రాలేదు. చాలా మంది ఈ సినిమాను మర్చిపోయారు కూడా. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మార్చి 7న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మనమే సినిమాలో శర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కృతిశెట్టి శర్వా కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. కానీ రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. కాగా ఓటీటీ రైట్స్ విషయంలో వివాదం నెలకొనడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ వివాదం ముగియడంతో సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.