వివాహమంటే ఇది కదా భయ్యా.. ఏనుగులు, గుర్రాలతో ఊరేగింపు.. రాజుల కాలం రోజులను..!

వివాహమంటే ఇది కదా భయ్యా.. ఏనుగులు, గుర్రాలతో ఊరేగింపు.. రాజుల కాలం రోజులను..!


ఈ రోజుల్లో పెళ్లంటే ధూం ధూంగా జరుపుకుంటారు. వివాహాలలో, వివాహ ఊరేగింపును తీసుకెళ్లడానికి చాలా వాహనాలను బుక్ చేసుకుంటారు. వరుడి కోసం గుర్రం బండి ఏర్పాటు చేసినప్పటికీ, ఈ గుర్రం బండి కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. అయితే దీనికి విభిన్నంగా పంజాబ్‌ ఒక వివాహం జరిగింది. అక్కడ వివాహ ఊరేగింపు ఏనుగులు, గుర్రాలు, ఎడ్ల బండ్లపై కదిలింది. ఈ ఊరేగింపులో దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులతోపాటు, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సహా వేలాది మంది పాల్గొన్నారు.

మాన్సా జిల్లాలోని సమవో గ్రామంలో ప్రసిద్ధ గిడ్డా కోచ్ పాల్ సింగ్ వివాహ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఈ వివాహంలో, ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. వరుడు స్వయంగా ఏనుగుపై స్వారీ చేస్తూ బయటకు వచ్చాడు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ గుర్రాలు, ఎడ్ల బండ్ల మీద పెళ్లి వేడుకకు చేరుకున్నారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న ఏనుగులు, గుర్రాలను అందంగా అలంకరించారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులతో పాటు, పంజాబీ సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా ఈ వాహన శ్రేణిలో ప్రయాణించారు.

ఈ వివాహాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి గిడ్డా కోచ్ పాల్ సింగ్ అన్ని ప్రయత్నాలు చేశాడు. అతను గ్రామంలోని అమ్మాయిలందరినీ తన వివాహ ఊరేగింపులో పాల్గొనమని ఆహ్వానించాడు. దీంతో పాటు, అతను జిల్లాలోని పౌరులందరినీ తన వివాహానికి ఆహ్వానించాడు. ఆయన పిలుపు మేరకు, మాన్సా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది వివాహ ఊరేగింపులో చేరారు.

వధువు కుటుంబం వివాహ ఊరేగింపును అంతే రాజ వైభవంగా స్వాగతించడం విశేషం. వివాహ ఆచారాలలో కూడా అన్ని సంప్రదాయాలను పాటించారు. ఈ వివాహ ఊరేగింపునకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను చూసినప్పుడు, రాజులు, యువరాజుల వివాహాల జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చాయని ప్రజలు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *