శ్రావణ మాసంలో శివ భక్తులు కావడి యాత్ర చేపట్టి.. గంగా జలంతో శివుడికి అభిషేకం చేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక జపాన్ కి చెందిన వ్యక్తికీ సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. పేరు హోషి తకయుకి. జపాన్ లో ప్రముఖ బిజినెస్. కోటీశ్వరుడు. ఇప్పుడు హోషి తకయుకి తన వందల కోట్ల వ్యాపారాన్ని విడిచి పెట్టి.. శివుడికి అంకితం అయ్యాడు. శివ భక్తిలో మునిగితేలుతున్నాడు. అంతేకాదు హోషి తకయుకి ఇప్పుడు బాల కుంభ గురుముని పేరుతో పిలబడుతున్నాడు.
జపాన్ లోని విలాసవంతమైన జీవితాన్ని విడిచి పెట్టి మన దేశానికి వచ్చాడు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం నివసిస్తున్నారు. కాషాయ వస్త్రాలను ధరించి బాల కుంభ గురుముని ప్రస్తుతం ఆత్మ గురించి తెలుసుకునేందుకు సాధనలో ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర చేపట్టారు. చెప్పులు లేకుండా పవిత్ర గంగాజలాన్ని తీసుకుని వచ్చి శివుడికి అభిషేకాన్ని చేశారు. ఈ యాత్ర చేసే సమయంలో ఆయనతో పాటు సుమారు 20 మంది జపనీస్ అనుచరులు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
హోషి తకయుకి ఎందుకు భారత దేశంలో స్థిర పడ్డారంటే..
హోషి తకయుకి సుమారు 20 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చారు. అప్పుడు ప్రాచీన సిద్ద సంప్రాదయం అయిన నాడీ జ్యోతిష్యం గురించి ఆయనకు తెలిసింది. వేల సంవత్సరాల క్రితం రాసిన తాళపత్ర ద్వారా వ్యక్తికి సంబంధించిన గతం, భవిష్యత్ ని తెలుసుకుంటారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోషి తకయుకి తన గురించి తెలుసుకోవాలని భావించాడు. అప్పుడు ఆతాళపత్ర గ్రంథాల ద్వారా హోషి తకయుకి పూర్వ జన్మ భారత దేశంలోనే జరిగిందని తెలుసుకున్నాడు. అంతేకాదు అప్పుడు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలో సానువుల్లో గడిపినట్లు.. ఆ తాళపత్ర గ్రంథాల్లో పేర్కొంది. హిందూ ఆధ్యాత్మికతను స్వీకరించడం అతని విధి అని పేర్కొంది.
Hoshi Takayuki, A millionaire from Tokyo adopts Sanatan dharma. Here, he can be seen worshipping Sri Laxmi Narsimha. 🔥 pic.twitter.com/IxqOMVHQIA
— Senāpati Bhakta (@bhaktSenapati) July 24, 2025
తన దేశానికి వెళ్ళిన తర్వాత అతనికి కొంతకాలం తర్వాత ఒక కల వచ్చింది. ఆ కలలో తాను ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఉన్నట్లు కనిపించింది. వెంటనే అతను భారత దేశం రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి అతడు జీవించే విధానం మారిపోయింది.
తన వ్యాపారాలన్నిటిని తన భాధ్యతలను తన అనుచరులకు అప్పగించాడు. ఆధ్యాత్మికత వైపు అడుగు వేశాడు. సన్యాసం స్వీకరించి తనకు తానే “బాల కుంభ గురుముని” అని నామకరణం చేసుకున్నారు. టోక్యోలోని తన ఇంటిని శివాలయంగా మార్చాడు. తర్వాత ఆ దేశంలో మరో కొత్త శివాలయాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టారు. మరోవైపు పుదుచ్చేరిలో 35 ఎకరాల భూమిలో ఒక పెద్ద శివాలయాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..