అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తానని అన్నారు. ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా నటించాడు. కానీ విక్రమ్ కంటే ముందే పలువురు హీరోలకు ఈ సినిమా స్టోరీ చెప్పానని అన్నారు గౌతమ్. “ధృవ నక్షత్రం కథను ముందుగా వేరే హీరోలకు చెప్పాను. కానీ కొన్ని కారణాలతో అందరూ రిజెక్ట్ చేశారు. వారి అభిప్రాయాలను నేను అర్థం చేసుకున్నాను.. అందుకే నాకేం బాధ అనిపించలేదు. కానీ ఈ కథను హీరో సూర్య కూడా నో చెప్పాడు. ఆ మాటను తట్టుకోలేకపోయాను. సూర్య నో చెప్పడం నన్ను ఎంతోగానో బాధించింది” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!
కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం
సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??
రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!