స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా..? కాంబో అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా..? కాంబో అదుర్స్ అంటున్న ఫ్యాన్స్


టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. డాలర్ డ్రీమ్ సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల రీసెంట్ గానే కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కథలు కూడా అలానే ఉంటాయి. ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు మన ఇంట్లోనో.. లేదా మన పక్క ఇంట్లోనో జరిగిన కథల్లానే ఉంటాయి. అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు.

రీసెంట్‌గా ధనుష్‌తో కలిసి కుబేర సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు శేఖర్ కమ్ముల. ధనుష్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది. కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల తర్వాత ఎవరోతో సినిమా చేయనున్నాడా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నారని టాక్ తెలుస్తుంది. శేఖర్ కమ్ముల ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్నారని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమా సమంత చేయనున్నారని అంటున్నారు. దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సమంత సినిమా చేయాలి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఈ కాంబోలో సినిమా సెట్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *