ఇండియాలో క్రికెట్, సినిమా ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినిమా హీరోలను చాలా మంది యువత రోల్ మోడల్స్‌లా భావిస్తూ ఉంటారు. మరికొంత మంది వాళ్లను డెమీ గాడ్స్‌లా కొలుస్తారు. ఇక క్రికెట్, సినిమా కలిస్తే ఆ జోడీ అదిరిపోతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఐపీఎల్ కూడా. బాలీవుడ్ స్టార్స్‌తో ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కొనిచ్చి.. సినిమా, క్రికెట్‌ను మిక్స్ చేశానంటూ ఐపీఎల్ తొలి ఛైర్మన్ లలిత్ మోదీ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఓ టీమిండియా క్రికెటర్.. మరో అడుగు ముందుకు వేసి.. ఓ స్టార్ హీరో కోసం ఏకంగా రెండు, మూడు కథలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.
ఆ క్రికెటర్ మరెవరో కాదు మిస్టరీ స్పిన్నర్ వరణ్ చక్రవర్తి. ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్బుత ప్రదర్శన కనబర్చడంతో పాటు ఐపీఎల్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో వరుణ్ ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తానకు తలపతి విజయ్ అంటే చాలా ఇష్టమని, అతన్ని మైండ్‌లో పెట్టుకొని ఓ రెండు, మూడు స్క్రిప్ట్‌లు కూడా రాసుకున్నట్లు వరుణ్ చక్రవర్తి తెలిపాడు. వరుణ్‌కు క్రికెట్‌తో పాటు సినిమాలంటే కూడా పిచ్చి. గతంలో ఒకటీ రెండు సినిమాల్లో కూడా నటించాడు. ఆ పిచ్చితోనే విజయ్ కోసం కథలు కూడా రాసుకున్నాడంటా.
ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. మరి ఆ కథలు ఇప్పుడు విజయ్‌కి చెప్పిన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ స్థాపించి, తన జీవితం ఇక ప్రజా సేవకే అంకితం, సినిమాలు ఇకపై చేయనని విజయ్ స్పష్టం చేశాడు. సో.. వరుణ్ రాసుకున్న కథలు అలాగే మిగిలి పోనున్నాయి. మరి భవిష్యత్తులో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఆ కథలతో వేరే హీరోని పెట్టి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
Varun Chakravarthy said “I like Vijay a lot – I have written 2 to 3 scripts by keeping Vijay in my mind”. [Gobinath YT] pic.twitter.com/lTUQCi1dJn
— Johns. (@CricCrazyJohns) March 15, 2025
ఇవి కూడా చదవండి: IPL Scandals: ఐపీఎల్ చరిత్రలో 5 అతిపెద్ద వివాదాలు.. రిచ్ లీగ్‌లో రచ్చలేపిన ఇష్యూలివే?