
సత్య ప్రమాణాలకు నెలవు తరిగొండ ఆలయం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ ఆలయం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని స్వామివారికి చెన్నైకి చెందిన భక్తులు బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు శ్రీ మనోహర్ లు 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. స్వామివారి దర్శనాంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ ముని…