
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్,యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి రెండుచోట్లు చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి…